మతసామరస్యానికి ప్రతిరూపం!
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష!


J.SURENDER KUMAR,

మతసామరస్యానికి ప్రత్యక్ష నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ప్రత్యక్ష ప్రతిరూపంగా విధులు కొనసాగిస్తున్న ఆమెను మేధావులు, ప్రజాస్వామ్య వాగులు ప్రశంసిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లోని దర్గా, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మసీదు పక్కపక్కనే ఉండడం, గొల్లపల్లి మండలం చెందోలిలోనీ , జమ్మికుంట బిజిగిరి షరీఫ్ దర్గా లకు. మతసామరస్యానికి నిలయంగా, ఎనలేని ప్రత్యేకత కలిగి ఉన్న చరిత్ర విషయం తెలిసిందె.


కొన్ని నెలల క్రితం జగిత్యాల కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన షేక్ యాసిన్ భాష, ఫిబ్రవరి మాసంలో సీఎం కేసీఆర్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పర్యటన ఏర్పాట్ల సందర్భంగా కలెక్టర్ ఆలయ సాంప్రదాయాలను ఆచరించడం నుదుట తిలకం, ధరించడం తీర్థప్రసాదాలు స్వీకరించడం ఏర్పాట్లు పర్యవేక్షించడం తదితర అంశాల తో పాటు ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా సీఎం పర్యటన విజయవంతం చేశారు.

మార్చి మాసం లో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు సందర్భంగా ప్రభుత్వం పక్షాన తలంబ్రాలు, పట్టు వస్తాలను ,సనాతన హిందూ ఆచార సాంప్రదాయ పద్ధతులను అర్చకులు వేద పండితులు చెప్పిన విధంగా ఆచరించి, స్వామివారికి అందించారు.

బుధవారం జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో, కలెక్టర్ రంజాన్ సాంప్రదాయ పద్ధతి ని పాటించారు. పరిపాలన తీరుతో పాటు పలు మతస్తుల మనోభావాలు మదనపడకుండా కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరును, పలువురు ప్రశంసిస్తున్నారు.