మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాల కోసం…

జగిత్యాల జిల్లాలో విరాళాల యాచన కార్యక్రమం !


J. Surender Kumar,


జిల్లా యూనియన్ మరియు ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు, అత్యవసర నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల ప్రెస్ క్లబ్బుల ఆధ్వర్యంలో..
శనివారం” మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బాసటగా విరాళాల యాచన ” కార్యక్రమం చేపట్టడం జరిగింది.


బీర్పూర్, వెలగటూర్, పెగడపల్లి, ధర్మపురి, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, రమేష్, లక్ష్మణ్, శాంతపు రావు, మహాదేవ్ ,గంగ మల్లయ్య, ప్రెస్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో యాచన కార్యక్రమం నిర్వహించారు.

బీర్పూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో!


జగిత్యాల జిల్లాలో దాదాపు పది మంది జర్నలిస్టు లు ( వార్త సేకరణలో, ప్రమాదవశాత్తు, అనారోగ్య తదితర కారణాలతో ) స్వర్గస్తులైనారు.

కొడిమ్యాల మండల ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో!


వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం పక్షాన ( ప్రెస్ అకాడమీ హైదరాబాద్) ద్వారా ₹ లక్ష ఆర్థిక సహాయం,. ప్రతి నెల ₹ 3000/- పెన్షన్ ఆ కుటుంబాలకు చెల్లించేవారు.

వెల్గటూర్ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో!

జిల్లాలో మృతి చెందిన జర్నలిస్టులకు సంబంధించిన దరఖాస్తులు ( దాదాపు 5) సహాయం కోసం ప్రెస్ అకాడమీకి సమర్పించడం జరిగింది. గత 14 నెలలుగా. ఈ దరఖాస్తులపై ప్రెస్ అకాడమీ వారు స్పందించడం లేదు, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు.

పెగడపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో


ఇట్టి అంశంపై యూనియన్ పక్షాన, అనేకసార్లు ప్రెస్ అకాడమీ అధికారులకు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

మల్యాల మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో!


వెంటనే ప్రెస్ అకాడమీ, హైదరాబాద్ వారు స్పందించి జగిత్యాల జిల్లాతో పాటు, రాష్ట్రంలో
మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు, ఆర్థిక సహాయం పెన్షన్ అందించాలని మనవి.

ధర్మపురి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో..


చీటీ శ్రీనివాసరావు, అధ్యక్షులు, మోరేపల్లి ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి, ఎండి ఇమ్రాన్. జె. సురేందర్ కుమార్, IJU, నేషనల్ కౌన్సిల్ సభ్యులు