ముస్లిం లు ఈ దేశ పౌరులు కారా.. ?
ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తామనే హోమ్ మంత్రి వ్యాఖ్యల పై ఆగ్రహం..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
J. Surender Kumar,
ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించే అధికారం. అమిత్ షా కు ఎక్కడ ఉందని,. ముస్లింలు ఈ దేశ పౌరులు కారా ? పట్టబద్రులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం జగిత్యాల పట్టణం లో ఆయన ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు.
రిజర్వేషన్లు మత ప్రాదిపదికన కాదని..సామాజిక వెనకబాటు తనంపై కల్పించారని గుర్తించాలని హితవు పలికారు.
బలహీన వర్గాలకు రిజర్వేషన్లు 40 శాతానికి పెంచాలి.. రాష్ట్రంలో పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అంటూ డిమాండ్ చేశారు.
హోం మంత్రి అమిత్ షా పర్యటన ఎన్నికల పర్యటనను మరిపించింది. కేంద్ర హోం మంత్రి గా స్థానిక సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం లకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నట్లు రిజర్వేషన్లు కేవలం సామాజిక వెనకబాటుతనం ప్రాతిపదికనే కల్పించారు. మత ప్రాతిపదికన కాదని అమిత్ షా తెలుసుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానం పరిశీలనలో ఉన్న రిజర్వేషన్ అంశంపై అమిత్ షా వ్యాఖ్యలు చేయడం కోర్టు దిక్కరణ కిందకు వస్తుందనే విషయం తెలియదా.? కొంచెం ప్రశ్నించారు.
రాజ్యాంగం లో 50 శాతం రిజర్వేషన్లు మించవద్దనే నిబంధన తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని, నిబంధన తొలగించి, రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించాలి అని పేర్కొన్నారు
60 శాతం ఉన్న బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ 40 శాతానికి పెంచాలన్నారు.
రైతులకు మద్దతు ధర కల్పించడం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత. అన్నారు
రైతులకు మద్దతు ధర కల్పించడం లో రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, కేంద్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, కాలేశ్వరం ప్రాజెక్టు సీఎం కెసిఆర్ కు ఏటీఎంల మారిందని ఆరోపిస్తున్న కేంద్ర మంత్రులు, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కమిషన్లపై ఎందుకు సీబీఐ, ఈ డీ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవిత ఏజెంట్ కు ₹ 15 కోట్లు ఇచ్చినట్టు సామాజిక మాధ్యమం లో వచ్చిన అంశం పై ఎందుకు విచారణ చేపట్టడం లేదు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతిపక్షాల అభ్యర్థులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు భరిస్తానని కేసీఆర్ అన్నట్లు సీనియర్ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయి చెప్పడంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని నిలదీశారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తామనడంలో జాతిని విచ్ఛిన్నం చేసే కుట్ర దాగి ఉందన్నారు.
కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మత విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
అమిత్ షా సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదికలను అమిత్ షా పరిశీలించాలని హితవు పలికారు.
కెసిఆర్ అవినీతిని బట్టలు చేయడంలో ఎవరు అడ్డుపడుతున్నారు ? అని జీవన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు లక్షలాదికరాల నష్టపోయిన పంటలను పరిగణలకు తీసుకొని, జాతీయ విపత్తిగా ప్రకటించాలని, రైతులకు పరిహారం అన్న చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, పిసిసి మైనార్టీ సెల్ సెక్రెటరీ మోయిజోద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, జగిత్యాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, మైనారిటీ సెల్ పట్టణ అద్యక్షుడు నే హాల్, రాధా కిషన్, మహిపాల్, రాజేష్, స్వామి రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.