ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్,
హౌస్ అరెస్ట్!
J.Surender Kumar,
వెల్గటూర్ మండలం పాషిగాం గ్రామంలో ఇథ నాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తులు ఏకమై మైసమ్మ తల్లికి బోనాలు, సామూహిక వనభోజనాలను గురువారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, జగిత్యాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ను, ధర్మపురిలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతి భద్రతల సమస్యలు నేపథ్యంలో వీరు పాసిగామ వెళ్ళకుండా హౌస్ అరెస్టు చేశామని పోలీసు వర్గాలు స్పష్టం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్యన ప్రజలు మైసమ్మ బోనాల జాతర నిర్వహించి, తమ ఐక్యతను చాటుకున్నారు.

స్టాప్ ఇథనాల్ అంటూ మైసమ్మ కు బోనాలు సమర్పిం చారు. కోళ్లు ను కోసి మైసమ్మకు రక్త తర్పణం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రహదారి పక్కనే ప్రజలందరూ వంటలు చేసుకొని సామూహిక వనభోజనాలు చేసి, ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ నినాదాలు చేశారు. మైసమ్మ తల్లి ప్రభుత్వము, ప్రజాప్రతినిధుల మనసు మార్చి ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించ కుండా రద్దు చేయాలని వేడుకున్నారు.

ఇథనాల్ ఫ్యాక్టరీని ఎవరైతే ఇక్కడ స్థాపించాలని తలంచారో వారే దీనిని తరలించాలని డిమాండ్ చేశారు. మా ప్రాణాలు అర్పించినా సరే ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించ కుండా అడ్డుకుంటా మని ప్రజలు నినాదాలు చేశారు. బోనాల కోసం ప్రతి ఇంటి నుంచి మహిళలు డప్పు చప్పులతో చేరుకున్నారు. మైసమ్మ గుడి వద్ద నుంచి ప్రజలు ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశానికి వెళ్లకుండా ధర్మపురి సిఐ బిల్లా కోటేశ్వర్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అక్కడే చెట్ల కింద అందరూ వంటలు చేసుకుందాము, నాగదేవత నందీశ్వరులకు నైవేద్యం సమర్పించే క్రమంలో క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్యన స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

చివరకు పోలీసులు గ్రామస్థులకు నచ్చచెప్పడంతో గ్రామ పొలి మేరల్లో వంట వార్పు చేసుకుని సామూహిక భోజనాలు ఆరగించారు. మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించే క్రమంలో గ్రామానికి చెందిన మహిళ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దంటూ, దాని వల్ల ప్రజలకు ఎంతో హాని కలుగుతుందంటూ భవిష్యవాణి వినిపించడం మైసమ్మ బోనాల లో. ప్రత్యేకత.