గాయపడిన మహిళ న్యాయవాదినే మోసం చేసింది!
ఢిల్లీ పోలీస్ డీసీపీ చందన్ చౌదరి!
J.SURENDER KUMAR,
న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టు వద్ద శుక్రవారం జరిగిన కాల్పుల్లో గాయపడిన మహిళ అనేక కేసుల్లో నిందితురాలు అని, కాల్పులు జరిపింది న్యాయవాది అని, ఆమె న్యాయవాదిని మోసం చేసింది పోలీసు ఉన్నతాధికారులు ANI వార్తా సంస్థకు స్పష్టం చేశారు.
ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌లో బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పై అనేక మోసం కేసులు ఉన్నాయని ఢిల్లీ పోలీస్ డీసీపీ చందన్ చౌదరి విలేకరులతో అన్నారు, వార్తా సంస్థ ANI ఉటంకిస్తూ. పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, M రాధ అనే మహిళ, డబ్బులను రెట్టింపు చేసే సాకుతో దాడికి పాల్పడిన న్యాయవాది నుండి డబ్బు తీసుకుంది, దీనికి సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో ఆమెపై FIR నమోదైంది వివరించారు..

నేటి సంఘటనలో బాధితురాలు నిందితురాలు అని డబ్బులను. రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి న్యాయవాదిని మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. మహిళపై అనేక ఇతర మోసం కేసులు కూడా నమోదయ్యాయి, ” అని చౌదరి చెప్పారు. దాడి చేసిన వ్యక్తి చాలా కాలంగా సాకేత్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారని పోలీస్ అధికారిని చౌదరి మీడియాకు తెలిపారు.

సంఘటన సమయంలో అతను ధరించిన యూనిఫాం అతనిదేనని చౌదరి చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ అతన్ని డిబార్ చేసిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు, మహిళ మరియు ఒక న్యాయవాది బుల్లెట్ గాయాలతో బాధపడుతున్నారని వారిద్దరినీ సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ మహిళ పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
( హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో)