జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
గతం లో ఉమ్మడి రాష్ట్రంలో సీఎం సహాయనిది ఆంధ్ర కే పరిమితం అయ్యేవనీ అన్నారు.
నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు శుక్రవారం సీఎం సహాయనిది ద్వారా మంజూరైన ₹ 10 లక్షల 50 వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం 103 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో 1 కోటి 80 లక్షలతో సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. 4 కోట్ల తో తెలంగాణ డయాగ్నొస్టిక్ ఏర్పాటు ద్వారా 56 వ్యాధులకి ఉచిత వ్యాధి నిర్దారణ పరీక్షలు ..ఆరోగ్య శ్రీ లో అదనం గా కొన్ని వ్యాధులను చేర్చడం వల్ల పేదలకు ఉపయోగంగా మారిందని అన్నారు. అరోగ్య శ్రీ నిర్వీర్యం అనేది పచ్చి అబద్ధాలు అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని అనివార్య ఘటనలు జరిగినా, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం అవుతుంటాయి సహజమని ప్రజలు దైర్యంగా ఉండాలని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు.

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో 100 పడకల ఆసుపత్రి ఉంటే నేడు 330 పడకల ఆసుపత్రి గా మారింది అని అన్నారు.
గతంలో 30 మంది వైద్యులు ఉంటే నేడు 150 మంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని
నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అని అన్నారు.
కొన్ని అనివార్య ఘటనలు ప్రతి ఆసుపత్రిలో జరుగుతూ ఉంటాయి…అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చుస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు,సర్పంచులు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ సభ్యులు,
నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల పట్టణ 11వ వార్డు గుట్ట రాజారాజేశ్వర ఆలయ రోడ్డులో ₹32 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను, 20 వ వార్డు లో ₹7లక్షలతో సిసి, డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన!
జగిత్యాల పట్టణ 29వ వార్డు లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం లు ప్రార్థన నిర్వహించుకునే ఈద్గా వద్ద ఏర్పాట్లను అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ ,ఖిల్లా వద్ద 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రహారీ పనులను నాణ్యత ప్రమాణాలను ఎమ్మెల్యే పరిశీలించారు.

₹ 50 లక్షలతో పలు అభివృద్ది పనులకు భూమిపూజ!
జగిత్యాల పట్టణ 14 వ వార్డు హనుమాన్ ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆలయం వద్ద ,₹ 4.60లక్షల తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ₹ 23 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి, ₹ 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హల్, ₹ 5 లక్షలతో మున్నూరు సంఘం భవనానికి,₹ 10 లక్షలతో డ్రైనేజి,₹ 10 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ది పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
