జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులు ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నారని విద్యార్థులు, నిరుద్యోగులు బిజెపికి దూరమవుతున్నారన్న ద్వేషంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నాపత్రాలను లీకు చేయిస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని పదో తరగతి పేపర్ లీకేజీ కేవలం బిజెపి చేసిన కుట్రనేననీ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పతకాలు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అభినందిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే లక్ష్యంగా బిజెపి పార్టీ కుట్రలకు తెరలేపిందన్నారు.
గ్రూప్ వన్ పరీక్షా పత్రాన్ని లీకు చెందిన రాజశేఖర్ రెడ్డి బిజెపి ముఖ్య కార్యకర్త అని ఎమ్మెల్యే చెప్పారు. ఉద్యోగ నియామకాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తుంటే యువత, నిరుద్యోగులు ఎక్కడ బీజేపీ కి దూరమవుతారో అన్న భయం బిజెపికి పట్టుకొందన్నారు.
నిరుద్యోగులను, విద్యార్థులను ప్రభుత్వానికి దూరం చేయాలన్న లక్ష్యంతో బండి సంజయ్ ప్రశ్నపత్రాల లికేజీకి కుట్ర పన్నాడన్నారు. కమలాపూర్లో మైనర్ బాలుర సహకారంతో పరీక్ష ప్రారంభం అయ్యిన తరువాత పేపర్ ను ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు తెచ్చి బండి సంజయ్ కు పంపిస్తే సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. పేపర్ల లీకేజీ లో బిజెపి అనుబంధ ఉపాధ్యాయ సంఘాల పాత్ర కూడా ఉండొచ్చని ఎమ్మెల్యే అన్నారు. బిజెపి పార్టీ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కేవలం రాజకీయ లబ్ధికోసం విద్యార్థుల, నిరుద్యుగుల జీవితాలతో అడుకొంటుందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తే మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు.
కానీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, ప్రజలు తెలంగాణకు వచ్జి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రదిస్ట పలు చేయాలన్న లక్ష్యంతో బిజెపి పార్టీ, బండి సంజయ్ లు కుట్రలుపన్నుతున్నారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం నిజాయితి పరుడైన జనార్దన్ రెడ్డిని టిఎస్పీఎస్సి చైర్మన్ గా నియమించిదన్నారు. 80 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తే గ్రూప్ వన్ పేపర్ లీకు చేయించి నిరుద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని బిజెపి దెబ్బతీసిందన్నారు. ఇక లక్షలాది మంది విద్యార్థులు రాసే పదో తరగతి ప్రశ్నపత్రాన్ని పక్కా ప్లాన్ తో లీకు చేయించిన బండి సంజయ్ మళ్ళీ పేపర్ లీకైందని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశాడన్నారు. అలాగే ఎందరో విద్యార్థుల మనసులను గాయపరచడమే కాకుండా తల్లిదండ్రుల ఆశలను దెబ్బతీసేందుకు బండి సంజయ్ కుట్ర చేశాడన్నారు. ఈ సందర్భంగా పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పై కేసులు పెట్టాలని అప్పుడే ఇలాంటి కుట్రలు మరోసారి జరగవని ఎమ్మెల్యే తల్లిదండ్రులను కోరారు. పేపర్ లీకేజీల కు ఓవైపు పాల్పడుతూనే మరోవైవు బండి సంజయ్ అమాయకుడిలా ప్రభుత్వ అక్రమ అరెస్టులు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, జగదీష్, బీఆర్ ఎస్ నాయకులు నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, వొళ్ళం మల్లేశం, పంబాల రాము, ముఖేష్ ఖన్నా తోపాటు పలువురు ఉన్నారు.