J. Surender Kumar,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. రానున్న కాలంలో ఏ ఎన్నికలు జరిగినా సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.

మేడిపల్లి మండల కేంద్రంలోని పీ.ఎన్.ఆర్ గార్డెన్స్ లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ,ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ , రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఎంపీపీ ఉమాదేవి మరియు ప్రజా ప్రతినిదులు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు…