ప్రారంభమైన భారత్ దర్శన్ యాత్ర -ఏక్ భారత్  శ్రేష్ఠ భారత్ నినాదం!

300 వాహనాల కాన్వాయ్ తో మహారాష్ట్రలో ప్రవేశం!


ఘనంగా స్వాగతించిన వార్ధ ఎమ్మెల్యే పంకజ్ భోయార్!


రాత్రి నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో బస!

J.SURENDER KUMAR,

హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం వందలాది వాహనాల కాన్వాయ్ తో భారత్ దర్శన్ యాత్ర ప్రారంభం అయ్యింది. రాత్రి 10 గంటల వరకు నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంకు చేరుకోనున్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నినాదంతో ఇతర రాష్ట్రాలలో ఏడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనున్నది.తెలుగు సంగమం కమిటీ అధ్యక్షుడు బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు నాయకత్వంలో, కొనసాగుతున్న ఈ యాత్ర మహారాష్ట్రలోని వార్ధా లోని సేవాగ్రం ను ( గాంధీజీ ఆశ్రమం) సందర్శించారు. వార్థ ఎమ్మెల్యే పంకజ్ భోయర్, భారత యాత్ర వాహనాలకు బాణసంచా కాలుస్తూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతించారు.

బిజెపి పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు తో యాత్రలోధర్మపురి జగిత్యాల్ బిజెపి నాయకులు

బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈ వాహనాలకు టోల్ గేట్ రుసుము మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం.
ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్ లో రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు భారీ పోలీసు భద్రత చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి.
ఈనెల 12న హైదరాబాదులోని విశ్వేశ్వరయ్య భవన్ లో   గవర్నర్ డాక్టర్ తమిళసై లాంఛనంగా ప్రారంభించారు.
వాహనల శ్రేణిలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, తదితర హిందుత్వ భావజాల సంస్థ నాయకులు కార్యకర్తలు ఆయా ప్రాంతాలలో  తమ తమ వాహనాలతో ఈ యాత్రలో పాల్గొననున్నారు.