ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ అనుకూల పథకాలు అమలు వల్ల రైతుల జీవన విధానం లో మార్పు జరిగిందన్నారు.
గతంలో నియోజకవర్గం లో 22 వేల ఎకరాలలో పంట సాగు చెస్తే నేడు 59 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అదనకు కలెక్టర్ బిఎస్ లత తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
రైతుల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారు…నేడు ముసుగు తీసి పలు పార్టీ లలో చేరడం మనం చూస్తున్నాం..ధాన్యం నిలువల కోసం గోదాంల నిర్మాణం..ప్రశ్నిస్తే పనులు జరుగవు అని పని చేస్తే అభివృద్ది సాధ్యం అని అన్నారు…

మిషన్ కాకతీయ, కాళేశ్వరం, చెక్ డ్యాం ల నిర్మాణం, 24 గంటల కరెంట్ తో వ్యవసాయం పండగ లా మారింది. భూగర్భ జలాలు జలాలు పెరిగి పశువులకు, పంటలకు అనుకూలంగా గ్రామాలు మారాయి…
వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తున్నారు..ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు గ్రామాలకు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు..
135 కోట్ల తో రోల్ల వాగు చెరువు ఆధునీకరణ తద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు..
1లక్షల SFT తో చల్ గల్ మార్కెట్ లో షెడ్ల నిర్మాణం..గత ప్రభుత్వాలు రైతు బజార్ ను నిర్వీర్యం చేశాయి నేడు బ్రహ్మాండం గా హాల్ సెల్ మార్కెట్ నిర్వహణ..రైతుల ఆశయాల సాధన కోసం,రైతును రాజు ను చేయడానికే ముఖ్యమంత్రి కృషి వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు
గతంలో 130 పడకల ఆసుపత్రి గా ఉంటే నేడు 330 పడకల ఆసుపత్రి గా మార్పు..
విద్య,వైద్యము,వ్యవసాయం,విద్యుత్,ఐటి రంగాలలో తెలంగాణ విక్టరీ ….వరి ధాన్యం కొనుగోలు లో రైతుల పాత్ర కీలకం…ధాన్యం శుద్ది చేసి తుకం వేయించాలని…కటింగ్ ఉండదని అన్నారు…జగిత్యాల నియోజకవర్గ రైతుల, ప్రజల పక్ష పాతిగా పనిచేస్తా…నిరంతరం వ్యవసాయ అధికారులతో సమీక్ష చేసి రైతుల సమస్య ల పట్ల, మొగి పురుగు వ్యాప్తి పట్ల అధికారులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, AMC ఛైర్మెన్ నక్కల రాధ, సర్పంచ్ గంగనార్సు రాజన్న, DCO రామానుజచార్యులు, పాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు, రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, తదితర నాయకులు పాల్గొన్నారు.
