ప్రీ వెడ్డింగ్ పార్టీ లో పెళ్ళికొడుకు పిచ్చి చేష్టలు!పెళ్లి పెటాకులైంది, కేసు నమోదు అయింది!

J. SURENDER KUMAR,

వివాహానికి ముందు జరిగిన ఫ్రీ వెడ్డింగ్ పేళ్ళి పార్టీలో  తన కాబోయే భార్య పట్ల పిచ్చి చేష్టలతో  అసభ్యంగా ప్రవర్తించినందుకు పెళ్ళికొడుకుపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు కావడంతో  జరగనున్న పెళ్లి పెటాకులైంది.
వివరాలు ఇలా ఉన్నాయి!

మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగిన ఈ ఘటనపై వధువు కుటుంబం నివాసం ఉంటున్న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహానికి ముందు జరిగిన వేడుకలో వరుడు వైష్ణవ్ ప్రవర్తనపై వధువు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, అతను మరియు అతని స్నేహితులు వారిపై దాడికి పాల్పడ్డారు.
ఈ సంఘటన తర్వాత పెళ్లిని రద్దు చేసుకోవాలని వధువు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి  తెలిపారు.
తన కుటుంబానికి ఇప్పటికే ఇచ్చిన ₹3 కోట్ల కట్నాన్ని తిరిగి ఇవ్వాలని వరుడిని డిమాండ్ చేశారు. అయితే, వరుడి కుటుంబం కట్నాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు వారు తమ స్వస్థలమైన చిత్తూరుకు వెళ్లిపోయారు.
వధువు కుటుంబం తాము వరుడికి ఇచ్చిన కట్నాన్ని తిరిగి తమ ఇప్పించాలని పోలీసులను  ఆశ్రయించారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి డైమండ్ రింగ్, ₹2 లక్షల విలువైన వాచ్‌ను కూడా ఇచ్చారు.
వరుడు వైష్ణవ్, అతని కుటుంబం, స్నేహితులపై ఐపిసి సెక్షన్ 354, 324 , 420 , 406 , కింద కేసు నమోదు చేయబడింది. మరియు 506 మరియు వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు అయినట్టు పోలీసు వర్గాలు వివరించారు.
పెళ్లికి ముందు జరిగిన ఫ్రీ వెడ్డింగ్ పార్టీ కోసం వధువు కుటుంబం ₹50 లక్షలు ఖర్చులు చేశారు.