సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారా?
J.SURENDER KUMAR,
రాహుల్ గాంధీ పిటీషన్ ను సూరత్ కోర్ట్ డిస్మిస్ చేస్తూ గురువారం వెల్లడించింది.. కాగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కి రెండేళ్లు జైలు శిక్ష వేయగా.. ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో సూరత్ సెషన్స్ కోర్టులో ఊరట లభిస్తుందని రాహుల్ భావించగా..అక్కడా నిరాశే ఎదురైంది. మరి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.
కాగా మోదీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు రేండేళ్లు జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. అలాగే ఎంపీగా అతనిపై పార్లమెంట్ వేటు వేసింది. కాగా తనపై విధించిన శిక్షను రద్దు చేయాలనీ..రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో రాహుల్ బెయిల్ ను పొడిగిస్తూ సెషన్స్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తనని దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ కోరారు. అలాగే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ రాహుల్ గాంధీ పిటీషన్ ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయానాడ్ నుంచి పోటీ చేసి రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండటంతో తాజాగా సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా తేల్చింది. రాహుల్ కి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చింది. దొంగలందరికి ఇంటి పేరు మోదీ అని ఎందుకు వచ్చిందని కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోఈ కామెంట్ చేశారు. ఆ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
మరోవైపు పరువు నష్టం కేసు లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు. మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టు తీర్పును స్వాగతించారు.