హైదరాబాద్ నుంచి వందలాది వాహనాల కాన్వాయ్ తో రాష్ట్రాల పర్యటన!
బిజెపి అగ్ర నాయకులే నిర్వహకులు!
J.SURENDER KUMAR,
హైదరాబాద్ నుంచి శనివారం వందలాది వాహనాల కాన్వాయ్ తో భారత్ దర్శన్ యాత్ర ప్రారంభం కానున్నది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నినాదంతో ఇతర రాష్ట్రాలలో ఏడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.
తెలుగు సంగమం కమిటీ అధ్యక్షుడు బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు నాయకత్వంలో, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణారావు, బిజెపి పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్, తెలుగు అకాడమీ చైర్మన్ అరవింద్ మీనన్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, గోదావరి హారతి రాష్ట్ర కన్వీనర్ వీరగోపాల్, కమిటీలో సభ్యులు గా ఉన్నారు. ఈనెల 12న హైదరాబాదులోని విశ్వేశ్వరయ్య భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళసై లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ , ఆదిలాబాద్ గుండా నాగపూర్ ఈ యాత్ర చేరుకుంటుంది, కేంద్రమంత్రి నితిన్ గడ్డగరి, యాత్రను స్వాగతిస్తారని సమాచారం. అక్కడ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో భోజన, వసతి ఏర్పాటు చేశారు. మరుసటి రోజు నాగపూర్ పరిసరాలలో పుణ్యక్షేత్రాల దర్శనం,హిందూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతుంది, మధ్యప్రదేశ్ భోపాల్, ఉజ్జయిని మహాకాళి, నాందేడ్ గురుద్వార్, తదితర పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను, యాత్ర సభ్యుల సందర్శించడంతోపాటు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, హిందుత్వం విశిష్టత తదితర సంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

దాదాపు 500 వాహనల శ్రేణిలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, తదితర హిందుత్వ భావజాల సంస్థ నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నట్టు తెలిసింది.