రేపు ధర్మపురి నియోజకవర్గంబిఆర్ఎస్ పార్టీ ప్లీనరీని సమావేశం!

ధర్మపురి పట్టణంలోని S.H ఫంక్షన్ హాల్ లో !


మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ !

J. Surender Kumar,

మంగళవారం (ఈనెల 25 న ) ధర్మపురి పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ ( ప్లీనరీ) సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 8:00 గంటల లోపు బిఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించాలి. అనే గ్రామపంచాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ,అయ్యోరి రాజేష్ ప్రకటనలో కోరారు.

నియోజక వర్గంలోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు,
కో-ఆప్టెడ్ సభ్యులు PACS, RBS, చైర్మన్లు,
సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో 100 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి అని పేర్కొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ ధర్మపురి పట్టణంలో ని నంది చౌక్ వద్దకు రావాలి అక్కడ జెండా ఆవిష్కరణ తర్వాత పాదయాత్ర గా SH గార్డెన్ కు చేరుకోవాలి.. ధర్మపురి SHఫంక్షన్ హాల్ లో ప్లీనరీ సమావేశం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, ప్లీనరీ లో పలు తీర్మానాలు ప్రవేశపటం ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు
మధ్యలో భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.