రేపు హైదరాబాద్ కు ప్రకాష్ అంబేద్కర్ రాక! 125 అడుగుల ఎత్తు అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ!

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా!

J.SURENDER KUMAR,

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ పట్టణ నడి బొడ్డున ఆవిష్కరించనున్నారు. అంబేడ్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేడ్కర్​ను కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాది.

విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగేలా భారీ క్రేన్ సాయంతో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో రూపొందించి పొందు పరిచారని.. అదే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతుంటారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో అతిపెద్ద అంబేడ్కర్‌ 125 వ జయంతి రోజున దేశంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.