రైతులకు ఎల్లవేళలా న్యాయ సేవాధికారి సంస్థ అండగా ఉంటుంది!

జూనియర్ సివిల్ జడ్జ్ శ్యాం ప్రసాద్!

J.SURENDER KUMAR,

రైతాంగానికి న్యాయ సేవాధికారి సంస్థ ఎల్లవేళలా అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మపురి న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జ్ శ్యాం ప్రసాద్ అన్నారు.
శనివారం ధర్మపురి శివారు గ్రామపంచాయతీ నర్సయ్యపల్లె లో వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహనా కల్పించే ఉద్దేశ్యం కొరకు జిల్ల లీగల సర్వీసెస్ జగిత్యాల వారి ఉత్తర్వుల మేరకు మన ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి శ్రీ. శ్యామ్ ప్రసాద్ వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు.

వివిద చట్టాలపైన రైతులకి అవగాహనా కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడు అందుబాటులొ ఉంటున్నది అని, ఎవరికి ఇలాంటి న్యాయ పరమైన సలహాలు, సూచనలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఈ సంస్థ ద్యారా న్యాయ సేవలు అందుకోవాలని జడ్జ్ కోరారు.


ఈ కార్యక్రమంలో నర్సయ్యపల్లె సర్పంచ్ నేరెళ్ల లావణ్య తిరుపతి , ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, మండల రైతుబందు సమితి కో ఆర్డినేటర్ సౌళ్ళ భీమయ్య
న్యాయవాదులు అప్పల నిరంజన్, రౌతు రాజేష్, రామడుగు రాజేష్, సంబరాజుల కార్తీక్, జాజల రమేష్, DCMS చైర్మన్ ఎల్లల శ్రీకాంత్ రెడ్డి , Amc చైర్మన్ అయ్యోరి రాజేష్ , మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గడ్డం మహిపల్ రెడ్డి,


ధర్మపురి గ్రామ రైతుబందు కో ఆర్డినేటర్ వోడ్నల మల్లెషం , వ్యవసాయ అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు