ఎన్నికల కమిషన్ విచారణ గప్ చుప్….
ఈనెల 24న హైకోర్టుకు విచారణ నివేదిక అందించనున్నారా ?
ధర్మపురి ఎన్నికల వివాదం ఏ మలుపు తిరగనున్నదో ?
జగిత్యాల జేఎన్ టియు కళశాలలో దాదాపు 5 గంటల పాటు కొనసాగిన విచారణ
భారత ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ముందు విచారణకు హాజరైన ఐఏఎస్ లు!
J. Surendar Kumar,
జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్ టియు కళాశాలలో సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి గల్లంతు అంశంపై చేపట్టిన విచారణ అంశాలు, ఊహగానాలకు సైతం అందనంతగా గప్ చుప్ గా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపాల్ సెక్రటరీ, వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ, సంజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ, రవి కిరణ్ ముగ్గురు సభ్యుల బృందం స్ట్రాంగ్ రూము తాళం చేవిల మిస్సింగ్ ఫై విచారణ చేపట్టింది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్ ఫై పూర్తీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విచారణ చేపట్టారు.

తాళం చెవి గల్లంతలో బాధ్యులు ఎవరో ? బలి పశువులు ఎవరో ? అనే విషయం ఈనెల 24న భారత ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించనున్న నివేదికలో వెలుగు చూసే అవకాశాలు ఉండవచ్చు. స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ ఈ అంశంలో కమిషన్ పరంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండవచ్చు అనే చర్చ జరుగుతుంది.
పకడ్బందీ గా విచారణ!

భారత ఎన్నికల కమిషన్ బృందం సోమవారం చేపట్టిన విచారణ పకడ్బందీగా జరిగింది. మీడియాను, హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు లక్ష్మణ్ కుమార్ ను సైతం పరిసర ప్రాంతాల్లోకి అనుమతించలేదు. వినతి పత్రం కానీ, వివరణలు కాని స్వీకరించడానికి, వినడానికి నిరాకరించినట్టు సమాచారం.

జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషతో పాటు గతంలో ఈ జిల్లాలో పని చేసి బదిలి అయిన, తాళం చెవి అంశానికి సంబందం ఉన్న అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, సీనియర్ ఐఏఎస్ శరత్ తో పాటు జగిత్యాల కలెక్టర్ గా విధులు నిర్వహించి బదిలిఫై వెళ్ళిన ఐఏఎస్ అధికారి రవి, అదనపు కలెక్టర్లు రాజేశం,( ఐఏఎస్), జల్దా అరుణశ్రీ, (ఐఏఎస్ )అప్పటి ధర్మపురి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్ బిక్షపతితో పాటు ఆ ఎన్నికల సంబంధం ఉన్న అధికారులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు

జేఎన్ టి యు కళాశాల ప్రత్యెక గదిలో కేంద్ర ఎన్నికల సంఘ విచారణ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేపట్టినట్టు చర్చ.
హైకోర్టులో కొనసాగుతున్న ధర్మపురి ఎన్నికల వివాదం, ఏమలుపు తిరగనున్నదో ? ఎవరి మెడకు చుట్టుకోనున్నదో ? ఏప్రిల్ 24 తర్వాత వెలుగు చూడనున్నట్టు చర్చ నెలకొంది.