పుదుచ్చేరికి ప్యాకేజీ బస్ సర్వీస్!
చెన్నై నగరం నుంచి ఏప్రిల్ 23న ..
J.SURENDER KUMAR,
ఎలాంటి బ్రాండ్ బీరైన తాగినంతగా ఇస్తారు, విలాసవంతమైన ఖరీదైన భోజనం అందిస్తారు. ఓ బ్రూవరీ కంపెనీ పుదుచ్చేరికి ప్రత్యేక బస్సు సర్వీస్ ప్యాకేజీ ప్రకటించింది. చెన్నై నగరం లో ఓ ప్రాంతం నుంచి ఏప్రిల్ 23న బస్ సర్వీస్ సేవలు ప్రారంభం కానున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.
పుదుచ్చేరిలో బీచ్‌లు, ప్రకృతి అందాలను వీక్షించేందుకు నిత్యం అనేకమంది పర్యాటకులు వెళ్తుంటారు. ఐతే టూరిస్టులను మరింతగా ఆకర్షించేందుకు కాటమరాన్ అనే బ్రూయింగ్ కంపెనీ.. ‘హాప్ ఆన్ బ్రూవరీ టూర్ బస్‌ను’ లాంచ్ చేసింది
పుదుచ్చేరి లో ఆల్కాహాల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ తమిళనాడు, కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్‌కు చెందిన ఆల్కాహాల్ లభిస్తుంది. ఇక్కడ కాటమరాన్ అనే బ్రూయింగ్ కంపెనీ 2021 నుంచి మైక్రో బ్రూవరీని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ హాప్ ఆన్ బ్రూవరీ టూర్ బస్ అనే ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది. ఏప్రిల్ 23 నుంచి ఇది ప్రారంభమవుతుంది. వారాంతాల్లో చెన్నై నుంచి పుదుచ్చేరిలోని కాటమరాన్ బ్రూవరీ కంపెనీకి తీసుకెళ్తారు. అక్కడ బ్రూవరీ మొత్తాన్ని చూపించి.. బీర్లు, భోజనం అందజేస్తారు.

ఇక్కడ ఎనిమిది కంటే ఎక్కువ రకాల బీర్‌లు అంబాటులో ఉంటాయి. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా వీటిని తయారు చేస్తారు. గోధుమలు, బార్లీ, జామ, జీడిపప్పు, మామిడి, జాక్‌ఫ్రూట్, సీరగ సాంబ బియ్యం, శంఖం పువ్వు, మందార పువ్వు, కొత్తిమీర ఆకులు, నన్నారి రసం ఉపయోగించి బీర్ తయారు చేస్తారు.
బీరు, వంటకాలు సహా మొత్తం ప్యాకేజీ ధర ₹.3,000గా నిర్ణయించారు. చెన్నైలోని ఒక ప్రదేశం నుంచి లగ్జరీ బస్సు ఉదయం 10.30 గంటలకు బయలుదేరి.. రాత్రి 9.00 గంటలకు తిరిగి చేరుకుంటుంది. ఒకేసారి 35 మందిని బస్సులో తీసుకెళ్తారు. బీర్ తయారీ ప్రక్రియను మొత్తం గైడ్ వారికి వివరిస్తారు.
అనంతరం 2 గంటలపాటు అపరిమిత బీర్‌ను అందజేస్తారు. ఆ సమయంలో ఏ బీర్ అయినా తాగొచ్చు.. ఎన్ని సార్లైనా తాగొచ్చు. వీటితో పాటు ఎంతో రుచికరమై, ఖరీదైన విలాసవంతమైన భోజనాన్ని కూడా వడ్డిస్తారు. ఐతే బస్సులో వెళ్లేటప్పుడు బీరు అందించరు. ఫ్యాక్టరీకి వెళ్లాకే.. ఇస్తారు.

బీరు తాగని వారు, పిల్లలకు వేర్వేరు ధరలు ఉంటాయి. వారికి బీరు కాకుండా.. స్పెషల్ మాక్‌టెయిల్స్, ఆల్కహాన్ లేని పానీయాలు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేస్తారని కంపెనీ ప్రతినిధి రంగరాజ్ ప్రకటించారు. త్వరలో ఇతర నగరాల్లో కూడా ప్రారంభిస్తామని ఆయన అన్నారు.