తిరుమల దివ్య దర్శనం టోకెన్ల జారీలో  మార్పులు!

కాలినడకన వెళ్లే భక్తులకు…


శుక్రవారం నుండి అమలులోకి..!


J.SURENDER KUMAR,

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మార్చింది .

నిన్నటి వరకు ఫుట్ పాత్ లు, గాలిగోపురం వద్ద దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేవారు.  అయితే శుక్రవారం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు అలిపిరిలోని భూదేవువి కాంప్లెక్స్‌లో తమ దివ్య దర్శనం టోకెన్‌ను తీసుకోవాలని టీటీడీ ప్రకటించింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు గాలిగోపురం చెక్‌పోస్టు వద్ద స్టాంపు తీసుకుంటేనే దర్శనానికి అనుమతి ఉంటుందని టీటీడీ పేర్కొంది.


టీటీడీ రోజుకు 8 వేల టోకెన్లను విడుదల చేస్తున్నందున, రోజువారీ టోకెన్లను సకాలంలో పూర్తి చేస్తే మరుసటి రోజు టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.