పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J. Surender Kumar,
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ ను విచారించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో బుధవారం జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. చైర్మన్ జనార్దన్ రెడ్డిని భర్తరఫ్ చేస్తే కేటీఆర్ బండారం బయట పడుతుందని అండగా ఉన్నారు అని ఆరోపించారు.
పేపర్ లీకేజీలో వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి నోటీసులా ? అంటూ జీవన్ రెడ్డి ఆశ్చర్య వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ చర్చ కనుమరుగు చేసేందుకు తెర పైకి బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్ కు తెర తీశారని ఆరోపించారు
లిక్కర్ స్కాం లో ఎందరినో అరెస్టు చేస్తున్నా ప్రభుత్వం కవిత విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో ? అంతు పట్టడం లేదని జీవన్ రెడ్డి అన్నారు.
30లక్షల మంది నిరుద్యోగులతో, వారి కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఆని ఆవేదన వ్యక్తం చేశారు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ అసమర్ధత స్పష్టంగా కనబడుతుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండ శంకర్, తదితరు నాయకులు పాల్గొన్నారు.