మీడియాతో మాట్లాడుతుండగా బ్లాక్ పాయింట్ రేంజ్ తో కాల్పులు!
పోలీసుల అదుపులో షూటర్స్ ?
J.Surender Kumar,
ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌పాల్ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ ను కూడా గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి కాల్చి చంపారు.

జైలు నుంచి వైద్య పరీక్షల కోసం మెడికల్ కాలేజ్ పోలీసులు ప్రయాగ్‌రాజ్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులు జరిపే సమయంలో అతీఖ్ సోదరులు పోలీసుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతున్నారు.

వారు మాట్లాడుతుండగానే.. దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు. మీడియా కెమెరాల సాక్షిగా కాల్పులు జరపడంతో సోదరులిద్దరూ మృతిచెందారు. కాల్పులు జరిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు రెండ్రోజుల క్రితమే అతీఖ్ అహ్మద్ కొడుకును యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
