విచారణ సమర్ధవంతంగా ఉండాలి- రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలి!

సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్ పై ప్రత్యేక దృష్టి సారించలి.


క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బుధవారం డీఎస్పీలు, సి.ఐ లు ఎస్ఐలతో పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసులు , SC/ST కేస్ లపై పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని, పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.

నేరాలను నియంత్రణ లో సీసీ కెమెరాలు చాలా ముఖ్య పాత్ర ఉందని సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలని, పనిచేయని సీసీ కెమెరాల గుర్తించి రిపేర్ చేయించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించి,ప్రజలకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి సకాలంలో నేరం జరిగిన ప్రదేశానికి చేరుకొని సూచించారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు. జిల్లా ల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.

రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.

జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్ ను పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్ పై ప్రత్యేక దృష్టి సారించలి.

సామాజిక మాధ్యమాలు విద్వేషాలతో కూడిన వ్యాఖ్యలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూట్యూబ్, ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లో అసభ్యకరమైన, అవమానకరమైన విద్వేషపూరితమైన పోస్టులు పెట్టి సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయం గా చిత్రీకరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ ప్రకాష్, రవీంద్ర రెడ్డి, రవీంధ్ర కుమార్ , SB, DCRB, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్, సి.ఐ లు, రాంచందర్ రావు, రమణమూర్తి ,కోటేశ్వర్, ప్రవీణ్ కుమార్, ఎస్ . ఐ లు DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు!.

డయల్ 100 కాల్ కి తక్షణమే స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
జగిత్యాల ప్రాంతానికి చెందిన ఓ యువతి వివాహం జరగడం లేదని, జీవితంపై విరక్తితో మల్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకుంటునన్ను అని తన అన్నకు ఫోన్ కాల్ చేసి తను రైలు కింద పడి చనిపోతున్నట్లు చెప్పింది.

వెంటనే యువతి అన్న 100 డయాల్ కు కాల్ చేసి విషయం తెలుపడంతో బ్లూకోట్ సిబ్బంది సెల్ ఫోన్ లొకేషన్ యువతిని కాపాడిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్ హెడ్ కానిస్టేబుల్ కనకయ్య , కానిస్టేబుల్ తిరుపతి లను జిల్లా ఎస్పీ గారు అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.


రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు ఖచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన విచారణ,ప్రోయాక్టివ్ పోలీసింగ్,కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మొదలైన రక్షణ క్రియాత్మక రంగాలలో వారు సాధించిన ప్రతిభ అధారంగా పలు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు కేటగిరీలలో పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయడం జరుగుతుంది.

2023 సంవత్సరానికి గాను క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి

వాటిలోంచి ఉత్తమ పోలీసు స్టేషన్లు గా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో ని సారంగాపూర్ 5 వ స్థానం , జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ 14 వ స్థానం రావడం జరిగింది.

సారంగాపూర్, జగిత్యాల రూరల్ ఎస్.ఐ లు మనోహర్ రావు ,అనిల్ లను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంశ పత్రం అందజేశారు. ఆదేవిదంగా పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న cctns 2.0 వర్షన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల రూరల్ ఎస్సైలు సతీష్, సుధర్ రావు, అనిల్ ను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.