మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చిత్త శుద్ది ఉంటే చక్కర కర్మాగారాన్ని పునః ప్రారంభింపజేయాలి !
తనను గృహ నిర్భంధం చేయడం పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిర భవన్లో శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
డిసిసి అధ్యక్షుడు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ జన్మదిన పురస్కరించుకోని కేక్ కట్ చేశారు.
అనంతరం విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో పరిసర గ్రామాలతో పాటు వేలాదిమంది కాలుష్యం బారిన పడుతారు.
ఏడాదికి 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు 1 టీఎంసీ నీరు అవసరం..
ప్రతి లీటర్ విత్తనాలు ఉత్పత్తికి 3,000 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి.
ఎల్లంపల్లి నుండి ఒక టీఎంసీ నీటిని తరలించి ఇథనాల్ ఉత్పత్తి అనంతరం కలుషితమైన నీటిని మళ్ళీ ఎల్లంపల్లిలో కలిపేందుకు చర్యలు చేపట్టడం దారుణం అన్నారు.
ఇథనాల్ పరిశ్రమ తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతుంది. నివాసి నివాసిత ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరచి ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పరిశ్రమ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతాలుగానే మిగిలాయన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని హైదరాబాద్ కు సైతం సరఫరా చేసే నీరు కలుషితమైతుంది.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతాల్లో ప్రజలు వ్యతిరేకించడంతో వెల్గటూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉందనే సాకుతో ప్రజల అభిప్రాయాలను వ్యతిరేకంగా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అంత ఆసక్తి ఎందుకో చెప్పాలి అని అన్నారు.
మంత్రి ఈశ్వర్ దొంగచాటుగా పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
అక్కడి ప్రజలను కలుసుకొని. వాస్తవాలను తెల్సుకునే ప్రయత్నంను అడ్డుకొని గృహ నిర్భంధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకేనా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది అని ప్రశ్నించారు.
జిల్లాలో పోలీస్ చట్టం అమలుకు మంత్రి బాద్యత వహించాలన్నారు.
వెల్గటూరు గొల్లపల్లి పెగడపల్లి మండలాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ అదనపు టిఎంసి పేరిట రెండు పంటలు పండే సస్యశ్యామలమై న భూమిని సేకరిస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
వంద రోజుల్లో చక్కర కర్మాగారాన్ని తెరిపిస్తామని చెప్పి ప్రైవేటు రంగంలో నడుస్తున్న కర్మాగారాన్ని సైతం మూసివేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ద్వజమెత్తారు.
జిల్లాలో పోలీస్ చట్టం అమలు చేస్తూ ఇథనాల్ పరిశ్రమ పనులు కొనసాగించాలనుకుంటే
ఆడబిడ్డలు తెగిస్తే అడుగు కూడా పెట్టలేరని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
నాలుగేళ్లలో ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు జగిత్యాల జిల్లా పై నిజమైన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే చక్కర కర్మాగారాన్ని పునరుద్ధరింపజేయాలన్నారు.
చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తే లక్ష ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది.
పంతాలు, పట్టింపులకు పోకుండా వాస్తవాలను గ్రహించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి.
కార్యక్రమంలో పిసిసీ సభ్యులు గిరి నాగభూషణం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, సర్పంచ్ మురళి, శైలేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, రాధా కిషన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, పట్టణ అధ్యక్షుడు నేహాల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు,
వెల్గటూరు స్తంభంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.