అట్ట హాసంగా జరిగిన ధర్మ పురి నియోజకవర్గ ప్లినరీలో..
మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
ఎవరు ఎంత దుష్ప్రచారం చేసిన బిఆర్ఎస్ ను అడ్డుకోలేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంగళవారం ధర్మపురి పట్టణంలోని ఎస్ హెచ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధులు సభలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, రాష్ట్ర పరిశీలకులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా తో కలిసి పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి
అట్ట హాసంగా ధర్మ పురి నియోజకవర్గ ప్లినరీ సమావేశం ప్రారంభించారు.

తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి.. అమరవీరులకు నివాళులు అర్పించారు..
ధర్మపురి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, బిఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు రాష్ట్రానికే కాదు దేశానికి అవసరమని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది లో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పధకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ అయ్యిందని కేసీఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా కోరుకుంటున్నారు ప్రజా సంక్షేమమే కేసీఆర్ సంకల్పం మన్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 8 ఏళ్ల బిజెపి పాలనలో ప్రజలకు ఏం మేలు చేయలేదని.. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చారని చెప్పారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పధకాలు అమలు చేస్తున్నారన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పుకోచ్చారు.

దేశంలో నే ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా తీసుకు వచ్చారని..దళితుల అభ్యున్నతికి దళిత బంధు ప్రవేశ పెట్టారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవహేళన చేసిన వారే ఇప్పుడు నోరు వెళ్ళబేడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్లినరీ సమావేశంలో రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటి సంక్షేమ శాఖా మంత్రి సమక్షంలో వ్యవసాయం, విద్య ఉపాధి -వైద్యం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి,బీజేపీ వైఫల్యాలు, హైదరాబాద్ నడి బొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగం అంశాల పై పార్టీ ప్రతి నిధులు సుధీర్ఘాంగా చర్చించి తీర్మాణాలు ఆమోదించారు..

ప్లినరీ ప్రారంబానికి ముందుతెలంగాణ తల్లి విగ్రహనికి
మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ నేతలు
పూల మాల వేసి.. అమరవీరులకు
నివాళులు అర్పించారు.అనంతరం ధర్మపురి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ ప్లినరీ సమావేశం లో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ , ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, జెడ్ పీ టిసి సభ్యులు రాజేందర్, జలంధర్, సుధారాణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మ పురి మండల పరిషత్ అధ్యక్షుడు చిట్టి బాబు , మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతుబంధు నాయకులు,
నియోజకవర్గంలోని ఆరు మండలాలలోని గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.