30 పోలీస్ యాక్ట్ ఉల్లంగించిన వారిపై కేసులు నమోదు!

జగిత్యాల ఎస్పీ భాస్కర్!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు, కోరుట్ల, మెట్పల్లి మరియు రాయికల్ పట్టణాల్లో 10-05-2023 న 30 పోలీస్ ఆక్ట్ అమలును ఉల్లంఘించి ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ ధర్నాలు, రాస్తారోకాలు చేసిన వారిపై జిల్లా వ్యాప్తంగా 6 కేసులు నమోదు చేయడం జరిగింది అని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ పత్రికా ప్రకటనలోపేర్కొన్నారు.  వీరందరిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నరు.  ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై కఠినంగా ఉంటామని శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న  జిల్లా పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

జగిత్యాల బస్సు డిపో దగ్గర, ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన కు సంబంధించి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని జిల్లా ఎస్పీ  పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. విచారణలో భాగంగానే జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్  ఎస్సై A. అనిల్ ను గురువారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగిందని వివరించారు.  చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకొని చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.