ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్!
J.SURENDER KUMAR,
సాహితీవేత్త, విద్యావేత్త, ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి మృతి తీరని లోటు అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు శ దేవులపల్లి అమర్ విచారం వ్యక్తం చేశారు.
ఒంగోలు తన కూతురు ఇంటిలో సోమవారం గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ గా ఉన్నప్పుడు నిర్వహించే జర్నలిస్టుల శిక్షణ తరగతులకు కేతు విశ్వనాథరెడ్డి హాజరయ్యేవారని అమర్ గుర్తు చేశారు.
2021 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా కేతు విశ్వనాథరెడ్డి అందుకున్నారు అని తెలిపారు.
వారి కుటుబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అమర్ తెలిపారు.