ఆంధ్రప్రదేశ్ కు చెందిన అతడు చేయూత అందించాడు!.
తెలంగాణ ఆడపడుచుకు ఇంటినీ నిర్మించి ఇచ్చాడు!
ప్రవాస భారతీయుడి దాతృత్వం!
J.SURENDER KUMAR,
ఆంధ్ర , తెలంగాణ ఉద్యమం తెలిసిందే. రెండు రాష్ట్రాలుగా విడిపోతే, ఆయా ప్రాంతాల్లో వివక్షత కొనసాగుతుందనే ఊహాగానాలు, అపోహలు, ప్రచార సాధనాల్లో కథనాలు తెలిసిందే. రాష్ట్రాలుగా విడిపోయిన , రెండు ప్రాంతాల ప్రజలలో ఆత్మీయ అనురాగాలు, స్నేహ సంబంధాలు, యధావిధిగా కొనసాగుతున్నాయి అనే విషయం, విషయాలు అనేక సందర్భాల్లో అగుపించిన, ఆగుపిస్తున్న, సంఘటనలు అనేకం అనే విషయం సమాజం కు విధితమే. ప్రాంతాలకు ప్రాంతీయ తత్వాలకు అతీతంగా అందించిన సహాయ సహకారాలు చిన్నదైనా భావి సమాజం కు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆంధ్రప్రదేశ్ , పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కు చెందిన, ఓ ప్రవాస భారతీయుడు, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా ధర్మపురి కి చెందిన నిరుపేద ఆడపడుచు ₹2.20 లక్షల విలువ గల ఇంటి నిర్మాణ ఖర్చులను భరించి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఆడపడుచుకు కు కానుకగా మంగళవారం అందించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మపురికి చెందిన పోచంపల్లి జమున కు ఇద్దరు కూతుళ్లు జన్మించాక భర్త కుటుంబ బాధ్యతలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దాంతో జమున కొందరి ఇళ్లలో బట్టలు ఉతుకుతూ ఇద్దరి పిల్లల్ని సాకుతుంది .సొంత ఇల్లు లేకపోవడం, కుటుంబ భారం తానే చూసుకోవడం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది.
ఎన్నారై దంపతుల ఔదార్యం.
అమెరికాలో ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కు చెందిన సుంకర పోసి ప్రవీణ్ ,చండీప్రియ దంపతులు గతంలో తమ కూతురు జన్మదిన సందర్భంగా పేదకుటుంబానికి ఇంటి నిర్మించారు. కాగా గతేడాది క్రితం వీరికి ఓ బాబు జన్మించాడు . వీరి కుమారుడు అభయ్ రామ్ శ్రీసత్య జన్మదిన సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మిద్దామని నిర్ణయించుకున్నారు.

తన ఫేస్బుక్ (F b) మిత్రుడైన ధర్మపురి కి చెందిన సామాజిక సేవకుడు, రేణికుంట రమేష్ ను, ఫోన్ ద్వారా సంప్రదించి కుటుంబానికి ఇల్లు నిర్మించి పెట్టాలని తమ వంతు ఆర్థిక సాయం చేస్తామని సూచించారు.
రమేష్ స్పందించి నిరుపేద జమున కుటుంబ వివరాలను వారికి వివరించారు . దాంతో వారు అంగీకరించగా ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించగా రమేష్ గత నెల క్రితం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా కొద్ది రోజుల క్రితం పూర్తయ్యాయి.
నూతన గృహ నిర్మాణానికి. ₹ 2.20 లక్షలు వ్యయం కాగా నూతన గృహాన్ని ప్రవీణ్ తండ్రి సుంకర వీర వెంకట సత్యనారాయణ, తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. గృహ నిర్మాణం అనంతరం కుమారుని జన్మదిన వేడుకల్ని నూతన గృహంలో నిర్వహించారు. అలాగే ఐదేళ్ల క్రితం తమ కూతురు ఇషా వైష్ణవి జన్మదిన సందర్భంగా రమేష్ ఆధ్వర్యంలో ధర్మపురి లోని ఓ పేద కుటుంబానికి వీరు ఇంటిని నిర్మించి ఇచ్చారు.

ఇళ్లను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని స్థానికులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యోరి వేణు ,జక్కుపద్మ , లయన్స్ క్లబ్ బాధ్యులు జక్కు రవీందర్, వైశ్య సంఘం అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, జగిత్యాల కు చెందిన సత్యసాయి అభయ హస్తం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.