అంగరంగ వైభవంగా – ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి  చందనోత్సవం!

J.SURENDER KUMAR,

మంగళ వాయిద్యాలు వేద మంత్రాల ఘోషలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి   ‘చందనోత్సవం’ సోమవారం ఉదయం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి చందనోత్సవం  పూజా కార్యక్రమాన్ని సుందరమైన స్వామివారి  చందన స్వరూపాన్ని తిలకించడానికి  తరలి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.


స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం, వేదపండితులు, అర్చకులు ,పురుషసూక్త , శ్రీసూక్తం,  కల్పోక్త ,  న్యాసపూర్వక ,  షౌడశోపచార పూజ , సహస్రనామార్చన,  పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని,  క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి ,  స్థాపిత దేవతాపూజల  అనంతరం  పూర్ణాహుతి , శ్రీస్వామి వారికి  చందనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెనవేషన్ కమిటి సభ్యులు , వేదపండితులు, అర్చకులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు