J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారంస్వామివారి జయంతి ఉత్సవాలు, జరిగాయి..

అంగరంగ వైభవంగా స్వామివారి తొమ్మిది రోజులు పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు,పూజాది కార్యక్రమాల ముగిశాయి . ఘనంగా ఆరంభమైన ఉత్సవాల్లో, సహస్ర కలశాభిషేకం, చందనోత్సవం, స్వామివారి వసంతోత్సవం, పల్లవ ఉత్సవాలు, నేడు జయంతి ఉత్సవం జరిగాయి.

ఆలయ ప్రాంగణంలో భక్తజనం రద్దీపెరిగింది. నేటితో స్వామివారి . నవరాత్రి ఉత్సవాలు ముసాయి. వేదపండితులు, అర్చకులు, సనాతన సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పూజలు నిర్వహించారు.
స్తంభోధవ పూజలు!

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ మండపంలోని రాతి స్తంభాలను పూలతో అందంగా అలంకరించారు. అర్చకులు వేద పండితులు వేదమంత్రాలు స్తంభాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్థంభం నుండి జన్మించడంతో. వేద పండితులు నరసింహ జయంతి రోజున ఆలయ మంటపంలోని స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయ.

ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తజనం రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
