లక్షలాదిగా తరలివస్తున్న హనుమాన్ దీక్ష పరులతో కొండగట్టు క్షేత్రం. పోటెత్తింది!
J.SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు కొండలు అంజన్న నామస్మరణలతో మారుమోగుతున్నాయి. రాష్ట్రం దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న అంజన్న దీక్షపరుల తో కొండగట్టు క్షేత్రం ఆదివారం పోటెత్తింది.

శనివారం సాయంత్రం మొదలైన రద్దీ ఆదివారం తెల్లవారుజాము వరకు మరింత పెరిగింది. పెద్ద హనుమాన్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షపరులతో ఆలయ పరిసరాలు కిటికీలాడుతోంది..

దీక్ష విరమణ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు…. జయంతి సందర్భంగా దీక్ష విరమణ చేస్తున్నారు…
క్యూలైన్లు లో హనుమాన్ దీక్ష పరులు తలపై ఇరుముడి పెట్టుకొని అంజన్న దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు .

విద్యుత్ దీప కాంతులతో కొండగట్టు అంజన్న ఆలయం మెరిసిపోతోంది . భక్తులకు తాగునీటి వసతి న దర్శన ఏర్పాట్లకు, మాల విరమణ కు. ఆలయ అధికారులు సిబ్బంది, జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఈ రద్దీ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగునున్నది. పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ, స్థానిక గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది హనుమాన్ భక్తజనంకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తున్నారు.

