“ఆరోగ్య మహిళ “ పథకం మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం. ప్రభుత్వ లక్ష్యం!

కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష !

J.SURENDER KUMAR,

ఆరోగ్యం మహిళా పథకం ప్రధాన లక్ష్యం ప్రతి మహిళా ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యం అని ప్రభుత్వం మార్చి 8న పథకానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ షేక్ యాసిన్ భాష అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోమహిళ ఆరోగ్య మేళ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. జిల్లా వైద్య అధికారి శ్రీధర్ మరియు డాక్టర్ జైపాల్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య మహిళ లకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు.


మహిళలకు ఇప్పటి వరకు అందని అవసరమైన ఆరోగ్య సేవలను గుర్తించి అందజేయడం మరియు అవసరమైతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆసుపత్రులకు పంపి వైద్య సేవలు అందేవిదముగా చూడడం. ప్రతీ మంగళవారము రాష్ట్ర వ్యాప్తము ఎంపిక చేయబడ్డ 100 ఆరోగ్య కేంద్రాలలో 8 రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుంది.
“ఆరోగ్య మహిళ “, “మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం” కార్యక్రమ ముఖ్య ఉద్దేశములు

  1. మహిళలకు ఇప్పటి వరకు అందని అవసరమైన ఆరోగ్య సేవలను గుర్తించి అందజేయడం.
  2. మహిళల ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తన మెరుగు పరుచడం.
  3. మహిళలకు సురక్షితమైన మరియు ( గోప్యత)/ప్రైవేటు వాతాణాన్ని కల్పించడం, తద్వారా మహిళలు ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చేవిధముగా ఆకట్టుకోవడం.
  4. మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి అవగాహన కల్పించడం.
    క్రింద పేర్కొన్న 8 రకాలకు సంబంచిన వైద్య సేవలు (పరీక్షలు) మహిళలకు అందించ బడును.
  5. వైద్య పరీక్షలు ( రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రములోని నిర్దారణ కేంద్రముకు పంపించడం)
  6. క్యాన్సర్ పరీక్షలు/స్క్రీనింగ్ ( రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు గర్భాశయం సంభంచిన క్యాన్సర్).
  7. సుక్ష్మ పోషక లోపాలు మరియు వాటి సవరణ మరియు చికిత్స/నిర్వహణ.
  8. అండాశయ వ్యాధి నిర్వహణ (PCOD)/సిండ్రోం, ఋతుసమస్యలు మరియు కుటుంబ నియంత్రణ.
  9. మోనొపాజ్ (రుతువిరతి) నిర్వహణ .
  10. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు (UTI) మరియ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు ( PID) ల నిర్వహణ.
  11. లైంగికముగా సంక్రమించే అంటువ్యాధుల (STI) నిర్వహణ.
  12. బరువు నిర్వహణ – ఉండవలసిన బరువు మరియు ఉన్న బరువు.
    ఈ కార్యక్రమము లో భాగంగా జిల్లలో (4) ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు మరియు (1) పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును గుర్తించడం జరిగినది.
  13. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – నేరెళ్ళ
  14. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- కొడిమ్యాల
  15. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- ఐలాపూర్
  16. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- కథలాపూర్
  17. పట్టాణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- జైశెట్టి రామ్ వెల్ ( జగత్యాల)
    పైన గుర్తించిన ఆరోగ్య కేంద్రాలలోని మహిళా వైద్యులకు మరియ మహిళా స్టాఫ్ నర్సులకు ప్రత్యేకముగా హైదరాబాద్ లోని M.N.J Cancer Hospital ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగినది మరియు కావలసిన వైద్య పరీక్షల పరికరాలు, మందులు మొదలైన వాటిని సమకూర్చడం జరినిడినది.
    జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రి లో అందించు వైద్య సేవలు:
    జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరిన్ టేన్దేంట్ జగిత్యాల వారి అద్వర్యములో రెఫెర్ చేయబడ్డ మహిళలు క్రింది సేవలు పొందవచ్చు.
  18. Mammogram స్తనముల ప్రత్యేక ఎక్స్ -రే చిత్రణము తీసి పరీక్షించుట
  19. Ultrasound – అల్ట్రాసౌండ్ పరీక్షలు
  20. Colposcopy – కల్పోస్కపి పరీక్షలు
  21. Cryotherapy
  22. Pap smear/biopFurther diagnostics etc.
  23. ఒక వేల అవసరమనుకుంటే హైదరాబాద్ లోని శిక్షణ పొందిన రాష్ట్ర స్థాయి ఆసుపత్రిలోచికిత్సకు రిఫర్ చేసి ఫాలో అప్ చేయడం జరుగుతుంది.
    ప్రతి మంగళవారం శిక్షణ పొందిన మహిళా వైద్యులు మరియు మహిళా వైద్య సిబ్బంది ద్వారా మహిళలకు అందిచు వైద్య సేవల కార్యక్రమము ఈ “ఆరోగ్య మహిళ “, “మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం”.
    ఈ కార్యక్రమాన్ని అమలుపరుచున్న క్రమం లో అందించబడిన సేవలు క్రిందివిదంగా ఉన్నవి.మొత్తం 4940 మహిళ లు నునమోదు కాగా వారికి వివిద రకాల వైద్య పరీక్షలు జరిపించడం జరిగింది. అందులో 247 మందిని ఉన్నత ఆసుపత్రులకు తగిన చికిస్థ కై సిఫారసు చేయబడినారు.
    థైరాయిడ్ వ్యాది కి సంబండిచి 247 మందికి పరీక్షించి సమస్య ఉన్న 34 మంది మహిళలను గుర్తించి వారికి చికిస్థ అందించడం జరిగింది.
    వివధ రకాల క్యాన్సర్ కు సంబందించిన పరీకలు జరిపి నోటిక్యాన్సర్ అనుమానితులు 18 మంది, బ్రెస్ట్ క్యాన్సర్ కు 20 , సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించి 13 మంది అనుమానితులను గుర్తించి ఉన్నత ఆసుపత్రులకు సిఫారసు చేయడం జరిగింది. మూత్రనాళ సంబద సమస్యలతో బాదపడుచున్న 329, మేనోపాస్ సమస్యలతో ఉన్న 2175 , STI సమస్యలు ఉన్న 118 మందిని, అధిక బరువు ఉన్న 594 మందిని, తీవ్ర రక్తహీనత తో బాదపడుసున్న 17 మందిని పరీక్షించి తగిన చికిస్త అందించడం జరిగింది. అవసరమైన వారిని ఉన్నత సేవలకై ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సిపారసు చేయడం జరిగింది. అని కలెక్టర్ వివరించారు