బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తాం !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ₹10,000/- ఆర్థిక సాయం.!

J.SURENDER KUMAR,

బీర్పూర్ మండలం అచునురి తండాలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఆదివాసుల ఇళ్లు కాలిపోగా, మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అగ్నిప్రమాదం లో కాలిపోయిన ఇళ్ల స్థలాలను స్థానిక ఎం పీపీ మసర్థి రమేష్, కాంగ్రెస్ మండల అద్యక్షుడు సుభాష్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అగ్నిప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కౌలుకు తీసుకొని, పత్తి సాగు చేసుకున్నామని, ఇంట్లో నిల్వ చేసిన పత్తితోపాటు ₹ 4.50 లక్షలు డబ్బులు సైతం కాలి బూడిద అయ్యాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదుట బోరున విలపించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బాధిత కుటుంబానికి ₹.10,000 నగదు ఆర్థిక సాయం అందించారు. దామోదర్ యాదవ్ కెనడా ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్, అధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ద్వారా మరో ₹ 10,000 ఆర్థిక సాయం అందించారు.అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, పత్తి పంట, నగదు కా తో ఆదివాసీల కుటుంబాలు రోడ్డున పడ్డాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


బాధిత కుటుంబాలు తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన సామాగ్రి అందజేయడంతో పాటు, ఇంటి ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బాధితుల స్థితినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
బాధిత కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాల సభ్యులు తాత్కాలికంగా ఉండేందుకు రేకుల షెడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎంపీపీ రమేష్, ప్రజాప్రతినిధులు సహకరిస్తారని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట
ఎంపీపీ మసర్తి రమేష్, కాంగ్రెస్ మండల అద్యక్షుడు సుభాష్ యాదవ్, సర్పంచ్ జితేందర్, సింగిల్ విండో చైర్మన్ నవీన్ రావు, ఎంపి టి సీ రంగు లక్ష్మణ్, ఆడేపు మల్లేశ్వరి తిరుపతి, వెయ్య కిరణ్, తదితరులు ఉన్నారు.