ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జన్మస్థలం కందకుర్తిలో పూజలు!
జూన్ 3 నుంచి 8 వరకు. ఐదు రోజులపాటు!
తెలంగాణలో పాగా కు పక్క స్కెచ్ ?
J.SURENDER KUMAR,
తెలంగాణలో అధికార హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా బిజెపి కేంద్ర నాయకత్వం పక్కా ప్లాన్ కు రూపకల్పన చేసింది. బాసర నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రం వరకు గోదావరి నది తీరాన భారీ యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, జన్మస్థలం నిజామాబాద్ జిల్లా కందకుర్తి లో ప్రత్యేక పూజలతో భారీ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
జూన్ మూడు నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్న యాత్ర ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగనున్నది.
కందకుర్తిలో పూజల అనంతరం, వందలాది వాహనాలు, ద్విచక్ర వాహనాలతో, భారీ ర్యాలీగా బాసర క్షేత్రానికి చేరుకొని సాయంత్రం గోదావరి నది ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. బాసర నుండి ర్యాలీగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు , ధర్మపురి క్షేత్రం వరకు చేరుకొని నదికి , హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. కాలేశ్వరం, ఏటూరునాగారం , భద్రాచలం వరకు యాత్ర కొనసాగానున్నది. ఈ సందర్భంగా నది తీర ప్రాంత గ్రామాలలో ఈ యాత్ర కు గ్రామ గ్రామాల లో ఘనంగా స్వాగతించడానికి, వందలాది గ్రామ కమిటీలను ఈ నెలలో ఏర్పాటు చేయనున్నారు. ప్రొఫెసర్లు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, బజరంగ్దళ్, రామ మందిర నిర్మాణ కమిటీ దాతలు, తదితరులతో, గోదావరి నది పవిత్రత, విశిష్టత, తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు, ఆధారమైన గోదావరి నది కలుషిత నివారణ చర్చ, నది కలుషితం కాకుండా కాపాడడం కోసం తీర గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఆయా ప్రాంతాల్లో నిర్వహించే సదస్సులలో వక్తలు వివరించనున్నారు.

కనీసం 1000 వాహనాలతో ఆరంభం కానున్న ర్యాలీలో ఆయా ప్రాంతాల నుంచి యాత్రలో వాహనాల చేరికతో, ఆ సంఖ్య చేరుకుంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ర్యాలీ రాత్రివేళ బస చేసే ప్రాంతంలో. సాంస్కృతిక కార్యక్రమాలు, నది తీర.గ్రామాలలో కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు, తదితర అంశాలపై రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మేరకు వసతికమిటీ, భోజన కమిటీ, ప్రచార కమిటీ, ఆయా పుణ్యక్షేత్రాలలో నిర్వహణ కమిటీలను ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వసతి ఏర్పాట్ల కమిటీల కన్వీనర్ గా బిజెపి రాష్ట్ర నాయకులు డీ.రామ్ సుధాకర్ రావు, భోజన కమిటీ కరీంనగర్ కు చెందిన ఓ నాయకుడు కన్వీనర్ గా, ధర్మపురి యాత్ర స్వాగత కమిటీ కన్వీనర్ గా సంగి నరసయ్య, కొనసాగనున్నట్టు సమాచారం. ఈనెల 2న హైదరాబాదులో మురళీధర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.
బాసర నుంచి భద్రాచలం, వరకు కొనసాగును భారీ యాత్ర నిర్వహణ, విధివిధానాల రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కు చైర్మన్ గా బాధ్యతలను అప్పగించడానికి బిజెపి నాయకత్వం సంప్రదిస్తున్నట్టు సమాచారం.