బాబు కంటిన్యూ సీఎంగా 8 సంవత్సరాల 256 రోజులు మాత్రమే!
కెసిఆర్ కంటిన్యూ సీఎం గా జూన్ రెండు నాటికి 9 సంవత్సరాలు!
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా దాదాపు దశాబ్ద కాలంకు పైగా రాజీలేని పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించి, సీఎం కేసీఆర్, కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడి రికార్డును సైతం బ్రేక్ చేయడంతో పాటు రానున్న జూన్ మాసం రెండున ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు కేసీఆర్ పూర్తిచేసుకుని తెలుగు రాష్ట్రాలలో ఏకైక సీఎం గా రాజకీయ చరిత్ర పుటలలో కెసిఆర్ చోటు లభించనున్నది.
సీఎంగా బాబు కొనసాగిన కాలం 13 సంవత్సరాల 247 రోజులు!

చంద్రబాబే ఎక్కువ కాలం, కానీ : చంద్రబాబు మూడు విడతలు సీఎం పదవిలో కొనసాగారు. మూడు విడతల్లో మొత్తం 13 ఏండ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే. ఉమ్మడి ఏపీలో 1995లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల తరువాత ఎన్టీఆర్ స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టారు. 1999 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకున్నారు. 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే వరకు సీఎం పదవిలో ఉన్నారు. ఈ మొత్తం కాలంలో ఎనిమిది సంవత్సరాలు 256 రోజులు మాత్రమే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ సీఎం అయ్యారు.
ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కొత్త రికార్డు కు చేరువయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త విశ్లేషణ మొదలైంది. చంద్రబాబు కంటే కేసీఆర్ ఒకే రాష్ట్రానికి ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా రికార్డుల్లో నిలుస్తున్నారు.
కేసీఆర్ కొత్త రికార్డు : 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడిన రోజు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పదే ఏట ప్రవేశిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు చంద్రబాబు పేరిట ఉంది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైనే ఈ రికార్డు ఇప్పటికీ కొనసాగుతున్నా.. ఒకే రాష్ట్రానికి అధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు మాత్రం కేసీఆర్ సొంతం కానుంది. 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్… 2023 జూన్ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని దాటనున్నారు.
తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ :
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఏపీ సీఎంగా 2014 జూన్ 8 నుంచి 2019 మే 23 వరకు కొనసాగారు. మొత్తంగా చంద్రబాబు 13 ఏళ్ల 247 రోజులు ఆ పదవిలో ఉన్నారు.
రాష్ట్ర విభజనతో చంద్రబాబు రికార్డును వేర్వేరుగా పరిగణలోకి తీసుకుంటున్నారు.
ఒకే తెలుగు రాష్ట్రంలో కంటిన్యూగా తొమ్మిదేళ్ల సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. వైఎస్సార్ 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచినా.. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్సార్ 5 సంవత్సరాలు 111 రోజులు సీఎం పదవిలో కొనసాగారు. కాసు బ్రహ్మానందరెడ్డి 7 సంవత్సరాల 221 రోజులు ముఖ్యమంత్రిగా పని చేసారు.
( వన్ ఇండియా సౌజన్యతో)