J.SURENDER KUMAR,
సివిల్స్ లో సత్తాచాటి అల్ ఇండియా UPSCలో 132వ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతీ రెడ్డిని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ జువ్వాడి నర్సింగరావు అభినందించారు.
కోరుట్ల నియోజకవర్గం నుండి మరో యువకుడు UPSC కీ హర్హత సాధించడం గర్వకారణం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు, ఇంతటి గొప్ప కుమారునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏనుగు అంజయ్య రెడ్డి సార్ (అయిలాపూర్ ) దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాల జిల్లా మరియు కోరుట్ల నియోజకవర్గం నుండి భవిష్యత్ లో మరింత మంది యువకులు IAS మరియు IPS ఉన్నత స్థాయిలలో ఉద్యోగాలు పొందాలని నర్సింగరావు ఆశాభావం వ్యక్తం చేశారు.