జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
J.SURENDER KUMAR,
రాయికల్ మండల అల్లిపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా 1 కోటి 29 లక్షల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు ₹ 1 లక్ష 80 వేల రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం గా అభివృద్ది చేస్తున్నాదని అన్నారు.
ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దానం, కంపోస్టు షెడ్డు ఏర్పాటు రాష్ట్రం లో 9వేల పాటశాలలో 7వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేశామన్నారు.
ఉడైస్ అనే కార్యక్రమం లో భాగంగా పాటశాల ను ఎంపిక చేయటం జరిగింది అల్లిపూర్ గ్రామంలో అభివృద్ది పనులకు సీసీ, బిటి రోడ్డు లు ₹ 87లక్షలు ఖర్చు చేశామని…
రైతు వేదిక కోసం ₹ 19లక్షలు వెచ్చించి రైతులు సమావేశాలు నిర్వహించి అధిక దిగుబడి పొందడమే రైతు వేదిక ఉద్దేశం అని అన్నారు.
రైతు బందు పథకం ద్వారా 2029 మంది రైతులకు ₹ 21కోట్లు 68 లక్షలు ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి
రైతు మరణిస్తే ఎలాంటి పైరవీ లేకుండా 10 రోజుల్లో ₹ 5 లక్షల రైతు భీమా వస్తుంది.
గ్రామంలో 15 మంది రైతుల కుటుంబాలకు ₹ 75 లక్షలు రూపాయలు రైతు భీమా వారి ఖాతాల్లో జమ అయ్యాయి అన్నారు.
330 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా ₹ 3 కోట్ల 30 లక్షలు పంపిణీ. చేశారు

గ్రామంలో మొత్తం 1580 ఆసరా పెన్షన్ లు నెలకు ₹ 32లక్షల 81 వేల చొప్పున అందజేస్తున్నమని అన్నారు.
805 మంది బీడీలు చేసే ఆడబిడ్డలకు నెలకు ₹ 16 లక్షల చొప్పున పెన్షన్ అందిస్తున్నాం అని అన్నారు.
గ్రామం లో 1874 మంది రేషన్ కార్డ్ దారులకు ప్రతి నెల 27 వేల 500 కిలోల బియ్యం పంపిణీ.
జగిత్యాల నియోజకవర్గం లో 172 చెరువులను మిషన్ కాకతీయ లో భాగంగా భాగుచేసుకున్నం అన్నారు. గ్రామంలో ఒక కోటి రూపాయల తో చెరువులను బాగు చేసుకున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం అమలు లేదని అన్నారు. గతంలో 2 డిగ్రీ కళాశాలలు,6 జూనియర్ కళాశాలలో ఉంటే…తెలంగాణ వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గం లో
నేడు 8 జూనియర్ 1 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేశామని అన్నారు.
1000 కి పైగా గురుకులాలు ఏర్పాటు ద్వారా పేద మధ్యతరగతి పిల్లల కు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది అని అన్నారు.
ఆల్లిపుర్ పాటశాలలో 10వ తరగతి కేంద్రం ఏర్పాటుకు తమవంతుగా బాధ్యతతో పనిచేశామని అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత ఇబ్బంది కలిగిందని పరీక్ష కేంద్రం ఏర్పాటు లో బి అర్ ఎస్ ప్రజా ప్రతినిధుల కృషి అభినందనీయం అని అన్నారు.
ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏటా ₹ 2వేల కోట్ల ను,ఇప్పటి వరకు ₹18వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు.
కార్యదర్శులను ₹15 వేల చొప్పున జీతం తో ఉద్యోగాల్లోకి తీసుకొని నేడు₹ 29 వేలకు పెంచామని,నిరసన విరమించి విధుల్లో చేరాలని,ముఖ్యమంత్రి కెసిఆర్ బోలా శంకరుడు అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.