దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష!

J.SURENDER KUMAR,

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాల కార్యాచరణ పై జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో . కలెక్టర్ యాస్మిన్ భాషా అధ్యక్షతన, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో శనివారం జరిగింది.

జగిత్యాల జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్ , సుంకే రవిశంకర్, ఎస్పీ భాస్కర్ అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత , మంద మకరంద్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, తదితరల పాల్గొన్నారు.