బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్
J.SURENDER KUMAR,
మహారాష్ట్ర నాందేడ్‌లో శుక్రవారం జరిగిన భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు., రెండు రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి., దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది.

చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కర్ణాటక ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. వ్యవసాయానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉంటూ కార్యకర్తలకు కెసిఆర్ దిశ దశ నిర్దేశించారు
