J.SURENDER KUMAR,
ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయంకు వచ్చిన రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. శనివారం జగిత్యాల మడలం రూరల్. చలిగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల తీరు పరిశీలించారు. ఇప్పటి వరకూ ఎంత పంట కొనుగోలు చేశారు, ఇంకా ఎంత కొనాల్సి ఉంది… తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రానికి ధాన్యం ను తీసుకు వచ్చిన వెంటనే తేమ శాతం పరిశీలించి నిర్ణీత తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోళ్లు నిర్వహించాలని, ఒ. పి. యం. ఎస్ లో వివరాలు నమోదు చేయాలని అన్నారు. కొను గోలు కేంద్రాలలో హమాలీ లు కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ను వెంటనే లోడింగ్ రైస్ మిల్లులకు తరలించాలని చెప్పారు. తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామం పంచాయతీ లో
ప్రత్యేక పరిశుద్య. కార్యక్రమంలో భాగంగా ఈరోజు చలిగల్ గ్రామం పంచాయతీలోని జరుగుతున్న పారిశుద్య పనులను కలెక్టర్
ఆకస్మికంగా తనిఖీలు చేశారు
ఈ కార్యక్రమంలో సంబంధించిన జిల్లా అధికారులు వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు