ఇసుక తరలింపు వాహనాలకు రహదారి బంద్!
స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం!
J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నదిలోకి నిర్మించిన ప్రైవేట్ దారికి అధికారులు బుధవారం గండి కొట్టారు.

ఇసుకను తరలించే వాహనాల నదిలోకి వెళ్ళవద్దని హెచ్చరించినట్టు సమాచారం.

అక్రమంగా ఇసుక తరలించడం కోసం కొందరు ప్రైవేటు వ్యక్తులు గోదావరి నదిలోకి రహదారి నిర్మించడంతోపాటు, దారి నిర్మాణం ఖర్చులకు డబ్బులు వసూలకు శ్రీకారం చుట్టారు. ‘ ధర్మపురి గోదావరి నదిలో ప్రైవేట్ దారి’ శీర్షికన ప్రచురితమైన వార్త కథనం కు ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది.

గోదావరి నది లోకి ఇసుక ట్రాక్టర్ల రాకపోకలను అడ్డుకోవడానికి దారికి గండి కొట్టిన అధికార యంత్రాంగంకు గోలి, కుమ్మరి వాడ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.