ధర్మపురి పట్టణలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించాలి!

డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి, మరియు కరెంటు కోతల ఆరికట్టాలని కోరుతూ లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.   మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు.

అంతకు ముందు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మార్కెట్ లో చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..


ధర్మపురి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మాణం చేసి ఇప్పటికి ఆరు నెలలు గడుస్తున్న ప్రారంభోత్సవానికి మాత్రం నోచుకోవడం లేదని, చిరు వ్యాపారులు  ఎండలో వ్యాపారం చేసుకుంటూ నీళ్లు,  బాత్రూమ్  వసతి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని దీనికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎం సమాధానం చెప్తారని, లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. తలాపున గోదావరి ఉన్నప్పటికీ ఒక మంత్రి హోదాలో ఉన్న కొప్పుల ఈశ్వర్  ఇక్కడి ప్రజలకు నీటి కష్టాలను మాత్రం దూరం చెయ్యలేక పోతున్నారని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం ప్రారంభోత్సవాలు చెయ్యడం తప్ప, ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించింది లేదని, ఇక్కడి మంత్రి, ప్రజాప్రతినిధులతో సహా అందరు అధికార పార్టీ కి చెందిన వారేనని కాని ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి మాత్రం వ్యాపారస్తులు  ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ప్రారంభించి ఇక్కడ వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా కరెంటు కోతలకు కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని  ఆయన డిమాండ్ చేశారు


ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన భట్ల దినేష్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్,  మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందెని మొగిలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, కస్తూరి శ్రీనివాస్, రఫియొద్దిన్, స్తంభం కాడి గణేష్, ఇఫ్తికర్, పట్టణ కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పోచయ్య, మల్లేశం, ప్రశాంత్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు