J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ గురువారం హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామి వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పీఠాధిపతికి ముందుగా దేవస్థానం పక్షాన పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య శేష వస్త్రం ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు,ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ ,అర్చకులు నంభి నరసింహ మూర్తి, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్,రాజగోపాల్, స్థానిక వేదపండితులు మధురామ శర్మ , అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు.

