ప్రధానం చేసిన మంత్రి మల్లారెడ్డి !
J.Surender Kumar,
ధర్మపురి పట్టణం కు చెందిన సింగరేణి కార్మిక నాయకుడు. ఒడ్డనాల రాజన్నకు, మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రమ శక్తి అవార్డు ప్రధానం చేసి సన్మానించింది. హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ పక్షాన రాజన్న ను సత్కరించి మెమొంటో ప్రధాన చేశారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ కార్మిక బొగ్గు గని కార్మిక సమాఖ్య కార్యదర్శిగా (TGBKS) కార్మికుల సంక్షేమం కోసం రాజన్న చేసిన పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వం శ్రమ శక్తి అవార్డు కు ఎంపిక చేసింది. పలువురు రాజన్నను అభినందించారు.