మే 8న లిస్టింగ్!
J.SURENDER KUMAR,
1994 లో హత్యకు గురి అయిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య తన భర్త హత్యకు సహకరించి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ మోహన్ సింగ్ విడుదలపై అభ్యంతరాలు, ఆక్షేపణం వ్యక్తం చేస్తూ బీహార్ ప్రభుత్వం తీరుపై ఆమె సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సోమవారం ఆమె పిటిషన్ స్వీకరించి మే 8న లిస్టింగ్ చేసినట్టు ANI వార్త సంస్థ కథనం.

ఐఏఎస్ అధికారి కృష్ణయ్య బీహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ డిస్టిక్ మెజిస్ట్రేట్గా ( కలెక్టర్ ). విధులు నిర్వహిస్తుండగా రాజకీయ మూక హత్య చేసింది. హత్యకు సహకరించిన కేసులో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్,కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

15 సంవత్సరాల కాలం పాటు జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ ను బీహార్ ప్రభుత్వం జైలు మ్యానువల్లో నిబంధనలను సవరించి ఏప్రిల్ 27న విడుదల చేసింది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకొని ఆపాలని కృష్ణయ్య భార్య ఉమా ప్రధాని నరేంద్ర మోడీని. అభ్యర్థించారు. బీహార్ జైలు మాన్యువల్‌ను సవరించడం ద్వారా మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుని నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే చేయాలని విజ్ఞప్తి చేశారు.

తన భర్త ఐఏఎస్ అధికారి అని, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె అన్నారు. రాజ్‌పుత్‌ల ఓట్ల కోసం, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన భర్తను చంపిన వ్యక్తిని విడుదల చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇదే అభ్యర్థనను ఆమె సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.