ఇథనాయిల్ ఫ్యాక్టరీ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి!

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష !

J.SURENDER KUMAR,

ఇథనాయిల్ ఫ్యాక్టరీ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష అన్నారు.
శుక్రవారం వెల్గటూర్ మండలం స్తంభంపల్లి, పాశిగామ గ్రామాలలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైతులు పండించిన వరి పంటను ఎక్కువగా పండించడం వల్ల ఎక్కువ మెట్రిక్ టన్నులు ఉండడం వల్ల  ఐ.కే.పి. సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ ల వల్ల ఉద్యోగ విషయంలో ఎక్కువగా ముందంజ లో ఉంటామని ఆమె తెలిపారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీలో పెట్రోల్  కలపడం వల్ల ఎక్కువ లాభం వస్తుందని, ఫ్యాక్టరీ లోకల్ లో ఉండడం వల్ల లాభాలు మనమే తీసుకోవచ్చని, అవి జిల్లా అభివృద్దికి ఉపయోగించవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఒకవేళ రైతులు ఎవరికైనా అపోహలు, సందేహాలు ఉన్నట్లయితే వారు కొత్తగా నిర్మించిన  వేరే ఇథనాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించాలని అనుకుంటే వారి పేర్లను లిఖిత పూర్వకంగా ఇస్తే ఒక లిస్ట్ తయారు చేసి వారి అపోహలను, సందేహాలను తోలగిస్తామని, ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.

రైతుల సంక్షేమం కోసమే క్రిబ్ కో పనిచేస్తుంది
-ప్రజలకు అన్యాయం చేసే ఆలోచన మాకు లేదు

-మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ !

రైతుల సంక్షేమం కోసమే క్రిబ్ కో పనిచేస్తుంది,ఇది రైతు సహకార సంస్థ, దీనిలో  వేలాది మంది రైతుల  తో పాటు నేను కూడా సభ్యుడుగా ఉన్నాను, రైతులకు అన్యాయం చేసే పనిని ఎప్పటికి చేయబోను. లేటెస్ట్ టెక్నాలేజీ తో చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఇక్కడ నిర్మించే ఇతనాల్ ఫ్యాక్టరీ పని చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రైతులకు భరోసా ఇచ్చారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇతనాల్ ఫ్యాక్టరీ పై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు పొన్నం ప్రభాకర్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ యాస్మిన్ బాషా హాజరై  ఇతనాల్ ఫ్యాక్టరీ పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు . దీని పై మీకున్న ఆపోహలను తొలగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్యాక్టరీ మీ దగ్గర నిర్మించటం అదృష్టంగా భావించాలి. పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంటుంది. కొత్త టెక్నాలజీ తో దీనిని నిర్మిస్తున్నారు.

ఇతనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది.  భవిష్యత్ తరాలు బాగుపడతాయని కలెక్టర్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఇది మంచిదని చెప్పడానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసి వచ్చామని   ఆప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు,  టెక్నీకల్ అధికారులు ప్రజలకు వివరించారు. వీరు మాట్లాడినంత సేపు సావధానంగా విన్న ప్రజలు,  ఏది ఏమైనా ఇతనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించవద్దని  మా జీవితాలతో అటాడు కోవద్దని అగ్ని గోళంను తెచ్చి మా మధ్యలో పెట్టాలని చూస్తున్నారు. ఇది మీకు న్యాయం కాదనిఇక్కడి నుంచి దీనిని వెంటనే తరలించాలని స్తంభం పల్లి పాహిగాం గ్రామస్థులు స్పష్టం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా ఈ వేదిక పైనుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా ప్రాణాలను హరించే ఇతనాలు ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించి మా జీవితాలతో ఆటాడుకోవద్దు తక్షణమే దీనిని ఇక్కడి నుంచి తరలించాలని మండల టిఆర్ఎస్ అధ్యక్షులు స్తంభంపల్లి సర్పంచ్ భర్త  చల్లూరి రామచంద్రం, ఎంపీటీసీ సతీష్ సర్పంచ్ బొప్పు తిరుపతి విజ్ఞప్తి చేశారు. మమ్ములను కాదని బలవంతంగా ప్రాజెక్టు ఇక్కడ నిర్మించాలని చూస్తే మా శవాలపై ప్రాజెక్టు పునాదులు వేసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో హెచ్చరించారు. 

ఈకార్య క్రమంలో ఎస్పీ భాస్కర్ ఆర్ డీ వో మాధురి, ఎమ్మార్వో రమేష్ ఎంపీడీవో సంజీవరావు కంపెనీ అధికారులు ఉన్నారు.