J.SURENDER KUMAR,
ప్రశాంతంగా ఉన్న జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గుట్ట కింద గ్రామాలలో రెండు రోజులు గా కలకాలం మొదలైంది. మావోయిస్టు పార్టీ పేరిట అధికార పార్టీ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు హెచ్చరిక లేఖలు వచ్చినట్టు చర్చ.
మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిరెడ్డి, అలియాస్ వెంకటేష్, పేరిట లేఖలు అందినట్టు సమాచారం. పోస్టులో వచ్చిందా ? కొరియర్ ద్వారా వచ్చిందా ? లేక అధికార పార్టీకి చెందిన నాయకుడికి ద్వారా వారికి అప్పగించారా ? అనే విషయంలో స్పష్టత లేదు. కంకణాల రాజిరెడ్డికి జగిత్యాల డివిజన్ లో కొంతకాలం పనిచేసిన పరిచయాలు ఉన్నాయి.
గత రెండు రోజుల క్రితం రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి , మావోయిస్టు కదలికపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలను ఆదేశించిన విషయం విధితమే. పోలీసులు, నిఘా వర్గాలు గత రెండు రోజులుగా లేఖల అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.