J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో ని శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 108 అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా నిర్వహించారు.
శుక్రవారం శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మదనవేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా నిత్యహోమం, నవగ్రహహోమం, అష్టోత్తర శతకలశాభిషేకం, పూలంగి సేవా తులాభారం నిర్వహించారు.

వేద మంత్రోచ్చావాల మధ్య శ్రీ మాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈకార్యక్రమంలో వేద పండితులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.