స్వామివారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం!
J.SURENDER KUMAR,
జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణంలోని అతి పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మంగళవారం శ్రీ రాధ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

స్వామి వారిని శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భేరితాడనం, దేవత్వానం, నవగ్రహ హోమారంభం, ధ్వజారోహణ, గోధూళికా, స్వామివారి కల్యాణం, అగ్ని ప్రతిష్ట హావనం, బలిహారణ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రంగుల పూలమాలలతో శ్రీ వేణుగోపాలస్వామి, రాధ రుక్మిణీసత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారినీ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంను ఆలయ వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక, ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, భజన కీర్తనల మధ్య ముత్యాల తలంబ్రాలతో స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
