నాలుగున్నరేల్లుగా యావర్ రోడ్డు విస్తరణకు ఎమ్మెల్యే ఎందుకు చొరవ చూపడం లేదు !
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
J. SURENDER KUMAR,
జగిత్యాల్ పట్టణ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడంను స్వాగతిస్తున్నామని, నాలుగున్నర సంవత్సరాలుగా యావర్ రోడ్డు విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు చొరవ చూపడం లేదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం జగిత్యాల లో ఆయన నివాసం ఇందిరా భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాటలలో…
1989లో జీవో 149 ప్రకారం జారీ చేసిన మాస్టర్ ప్లాన్లు స్పష్టత లోపించడంతో అనుమతులు పొందడంలో ఇబ్బందుల దృశ్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవ తీసుకొని కర్త కర్మ క్రియగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు..
డిసెంబర్ 15 2022లో జీవో నెంబర్ 238 ప్రకారం జారీ చేసిన మాస్టర్ ప్లాన్ తో ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు.
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కర్త కర్మ క్రియగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముందు వరుసలో ఉండి అధికారుల నిర్లక్ష్యం పొరపాటు అనడం ఆశ్చర్యకరం..మాస్టర్ ప్లాన్ జీవో ఉపసంహరణ ను స్వాగతిస్తున్నాం
బిజెపి టిఆర్ఎస్ బంధం చైనా మాంజా బంధం..
బిజెపి టిఆర్ఎస్ బంధం చైనా మాంజా లాగా గట్టి బంధమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
బిజెపి టీఆర్ఎస్ మధ్య గతంలో ఉన్న మైత్రి బంధం కొనసాగుతోందని వీరు ఇరువురి మధ్య అంతర్గత ఒప్పందం ఉందనీ బిజెపి నాయకులే అంటున్నారన్నారు.
లిక్కర్స్ స్కాంలో కవిత పాత్ర ఆధారాలతో వెలుగు చూస్తున్న సిబిఐ మెతకధోరణి బిజెపి బిఆర్ఎస్ మైత్రికి నిదర్శనం అన్నారు.
తెలంగాణలో లిక్కర్ మేనేజ్మెంట్ పాఠాలు ఢిల్లీ వాళ్లకు నేర్పేందుకు వెళ్లారు అని ఎద్దేవా చేశారు.
లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్, అరవింద కుమార్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజలు విజ్ఞులని అన్ని గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ వాస్తవ దృక్పథంతో మాట్లాడారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ కి గ్రామ గ్రామ క్షీరాభిషేకం..