జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి !

జగిత్యాలలో జర్నలిస్టుల నిరసన !

జె.సురేందర్ కుమార్,

హైద్రాబాద్‌లో ఏబీఎన్, హెచ్.ఎం.టి.వి కెమెరా మెన్, జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషమని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. హైద్రాబాద్ జర్నలిస్టులపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం జగిత్యాల జర్నలిస్టులు స్థానిక తహసిల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఏబిఎన్, హెచ్.ఎం.టివి జర్నలిస్టులపై దాడిచేయడం దారుణమని ప్రెస్ క్లబ్ అద్యక్షులు శ్రీనివాసరావు అన్నారు.

ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, వారిపై న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్న మార్పులకు దారితీసింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని శ్రీనివాసరావు అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి వంశీతోపాటు హెచ్.ఎం.టి.వి ఆనంద్, ఏ. బి.ఎన్ శ్రీనివాస్తోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల నిరసన ప్రదర్శనలో ఉంది.